Header Banner

వైసీపీకి షాకుల మీద షాకులు.. వైసీపీకి గుడ్‌బై, జనసేనకు హలో! ఎంతమందో తెలుసా..?

  Tue Feb 25, 2025 14:52        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగలబోతోంది.. వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలో చేరగా.. బాలినేని ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరరేందుకు సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు.. పవన్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో- ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.. గత కొద్దికాలంగా జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్ల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం పలుసార్లు వాయిదా పడిందని నేతలు చెబుతున్నారు..


ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..



గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్డ్డి.. వైసీపీలో ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచారు పలువురు వైసీపీ నేతలు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన పార్టీలో చేరడంతో.. ఆయన వెంటనే నడుస్తామని ప్రకటించారు వైసీపీ కార్పొరేటర్లు.. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను తమ చేతుల్లోకి తీసుకుంది టీడీపీ.. తాజాగా, 23 మంది సభ్యులు జనసేనలో చేరితే ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం మారతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా, వైసీపీ కార్పొరేటర్లు జనసేన వైపు చూసినా.. వారిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి.. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి షాక్ ఇస్తూ.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్దం అయ్యారు ఒంగోలు కార్పొరేటర్లు..


ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #janasena #ongole #todaynews #flashnews #latestupdate